పూల రంగడులో డాన్స్ ఇరగదీస్తున్న సునీల్


కామెడీ హీరో సునీల్ ‘అందాల రాముడు’ మరియు ‘మర్యాద రామన్న’ చిత్రాలలో నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా నిరూపించుకున్నాడు. తను నటిస్తున్న తరువాత చిత్రం ‘పూల రంగడు’ చిత్రంలో మరో సారి తన డాన్స్ టాలెంట్ ను ప్రేక్షకులకు రుచి చూపంచబోతున్నాడు. ప్రస్తుతం గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరొక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.

సునీల్ మరియు ఇషా చావ్లా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకత్వం వహించారు.మాక్స్ ఇండియా బ్యానర్ పై అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో జనవరి 5న విడుదల కానుంది. పూల రంగడు సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

Exit mobile version