భీమవరంలో ‘భీమవరం బుల్లోడు’ ఆడియో లాంచ్ ?

భీమవరంలో ‘భీమవరం బుల్లోడు’ ఆడియో లాంచ్ ?

Published on Dec 11, 2013 2:20 AM IST

Bhimavaram-Bullodu
సునీల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘బీమవరం బుల్లోడు’. ఉదయశంకర్ (కలిసుందాం రా ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాని సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ మధ్య ఈ సినిమా డిజిటల్ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సునీల్ కెరీర్ లో హీరోగా మరో మంచి సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరోక లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సమాచారం ఈ సినిమా ఆడియో ని భీమవరంలో విడుదల చేయనున్నారని సమాచారం. దానికి కారణం అది సునీల్ పుట్టిన ప్రదేశం. ఈ సినిమాపై భీమవరంలో విడుదల చేస్తే మంచి పాపులర్ అవుతుందని బావిఅస్థున్నరు. అలాగే ఈ సినిమా టైటిల్ ఆ ప్రదేశానికి సంబంధం వున్న కారణంగా ఈ సినిమా ఆడియోని అక్కడ లాంచ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ సినిమా ఆడియో లాంచ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరు కావచ్చునని సమాచారం. అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు