కామెడీ హీరో సునీల్ ‘భీమవరం బుల్లోడు’తో సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జనవరి 14న గానీ,15న గానీ విడుదలచేసే అవకాశాలు వున్నాయి
ప్రస్తుతం సంక్రాంతి సమయంలో మహేష్ ‘1- నేనొక్కడినే’, రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసినదే. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ప్రకారం ఈ రెండు సినిమాల మధ్యా ఒక కామెడీ ఎంటర్టైనర్ నిలబడి గెలవగలదట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు
ఈ సినిమాలో ఏస్తర్ హీరోయిన్. ఉదయ శంకర్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ స్వరాలను అందించాడు. డి. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు