సునీల్ మరియు భీమనేని కలియకలో రానున్న సినిమా

Bhimaneni-Srinivasa-Rao-and
కామెడి హీరో సునీల్ మరియు భీమనేని శ్రీనివాసరావు కలిసి ఒక సినిమాకోసం త్వరలో పనిచేయనున్నారు. ఈ సినిమా త్వరలో మొదలుకానుంది. ‘సుడిగాడు’ సినిమాతో విజాయాన్ని సొంతంచేసుకున్న భీమనేని ‘సుందరపండియన్’ అనే తమిళ సినిమా అనువాదహక్కులను సొంతంచేసుకున్నాడు

ఈ అనువాద సినిమాలో సునీల్ హీరోగా నటించడానికి అంగీకరించాడు. దర్శకుడు స్క్రిప్ట్ లో మన ప్రాంతానికి తగ్గటుగా కొన్ని మార్పులు చెయ్యనున్నాడు. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు. సునీల్ ప్రస్తుతం ‘దసరా బుల్లోడు’ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాణమవుతుంది

Exit mobile version