హిట్ ఫార్ములాను మరోసారి రిపీట్ చేయనున్న సందీప్ కిషన్


యంగ్ హీరో సందీప్ కిషన్ ఈమధ్య యాక్షన్ సినిమాలను కాస్త తగ్గించి ఎంటర్టైన్మెంట్, స్టోరీ బేస్డ్ కథలను ఎంచుకుంటున్నారు. ప్రసుతం ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ సినిమా చేస్తున్నారు ఆయన. ఇది కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా. అంటే పూర్తిగా కథాపరమైన చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ చిత్రం చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రాన్నిఎంటర్టైన్మెంట్ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘తెనాలి రామకృష్ణ బీఏ. బిల్’ చిత్రాన్ని చేశారు.

ఈ సినిమా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. వరుస పరాజయాల్లో ఉన్న సందీప్ కిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే మరోసారి ఆయనతో సినిమా చేయడానికి పూనుకున్నారు సందీప్ కిషన్. ఇది కోడ్ కంప్లీట్ ఎంటర్టైనర్ గానే ఉండనుంది. ఈ ఏడాది డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు, ఇందులో హీరోయిన్ హీరోయిన్ లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాగేశ్వర్ రెడ్డి గతంలో ‘సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ లాంటి కామెడీ ఎంటెర్టైనర్లతో మంచి విజయాలను అందుకున్నారు.

Exit mobile version