ఆరు కొత్త అవతారాల్లో కనిపించనున్న సందీప్ కిషన్

sundeep-kishan
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘డికె బోస్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పెండింగ్ ఉన్న 3 పాటలను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారు. సందీప్ ఈ సినిమాలో యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తన పాత్ర గురించి ‘చెబుతూ ‘ ఈ సినిమాలో నాకు నచ్చిన ఆరు విభిన్న అవతారాల్లో కనిపించానున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఫైట్స్ – డాన్సులు తెరపై చూస్తారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని’ అన్నాడు.

నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బోస్ డైరెక్టర్. బోస్ అత్యుత్తమ పనితనం వల్లే ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తయ్యిందని ఈ చిత్ర టీం అంటున్నారు. ఆనంద్ రంగా – శేషు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version