దేవ కట్టా తెరకెక్కించిన ‘ప్రస్థానం’లో నటించిన సందీప్ కిషన్ ఆ సినిమా తరువాత చెప్పుకోదగ్గ సినిమాలే చేస్తున్నాడు. రెండేళ్ళ క్రితం విడుదలైన రాజ్ & డి. కె యొక్క ‘షోర్ ఇన్ ది సిటీ’తో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. పోయిన సంవత్సరం ‘రొటీన్ లవ్ స్టోరీ’తో ప్రయోగం చేసిన తను కెరీర్లో మొదటిసారిగా కుమార్ నాగేంద్ర తీస్తున్న ‘గుండెల్లో గోదారి’ సినిమాలో మాస్ రోల్ చెయ్యనున్నాడు. ఇందులో తను కోళ్ళ పందాలను ఇష్టపడే పాత్రలో కనిపించనున్నాడు . అతని నటన చాలా వాస్తవీకంగా ఉంటుందట. ఈ సినిమాలో లక్ష్మి మంచు, తప్సీ, ఆది కూడా నటిస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా మర్చి 8న మన ముందుకు రానుంది.
‘గుండెల్లో గోదారి’ తరువాత సందీప్ కిషన్ నటించిన మరో మూడు సినిమాలు ఈ సమ్మర్లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘మహేష్’ అనే తమిళ్ డబ్బింగ్ సినిమా ఈ నెల చివర్లో విడుదల అవుతుంది. దాని తరువాత ‘డి ఫర్ దోపిడీ’, ‘డి కె బోస్ ‘ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.