‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ సినిమా విడుదలైన నాటినుండి సందీప్ కిషన్ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అభినందించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ వారానికి ఇదే పెద్ద సినిమా కావడం విశేషం. మౌత్ టాక్, మంచి రివ్యూలు ఈ సినిమాకు ఎంతో సహకారం చేస్తున్నాయి
ఈ సినిమాలో హీరోగా చేసిన సందీప్ ఆనందంలో వుండడం ఆశ్చర్యం కాదు. అతని కెరీర్ లోనే ఇది పెద్ద రిలీజ్. మొదటిసారి గా కమర్షియల్ ఎంటెర్టైనర్లో నటించిన తనకి కామెడీ, ఛోటా కెమెరా పనితనం సినిమాలో తొడయ్యాయి
సందీప్, రాకుల్ ప్రీత్, నాగినీడు, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ సినిమా మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. రమణ గోగుల సంగీతాన్ని అందించాడు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ ఈ సినిమాను నిర్మించాడు