మల్టి స్టారర్ సినిమా చేయబోతున్న సుమంత్

మల్టి స్టారర్ సినిమా చేయబోతున్న సుమంత్

Published on Mar 12, 2012 9:13 AM IST


సుమంత్ ఈ సారి మల్టి స్టారర్ చిత్రం చేయబోతున్నాడు. ‘దగ్గరగా దూరంగా’ మరియు ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రాల తరువాత అతను చేయబోయే చిత్రం ఇదే. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్ర పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ ఏడాదిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘నా తరువాత చిత్రానికి అంగీకరించడం జరిగింది. మల్టి స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మిగతా తారాగణం ఎంపిక జరుగుతుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాము’ అంటూ సుమంత్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. సుమంత్ సరైన స్క్రిప్ట్ కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూసిన స్క్రిప్ట్ నచ్చడంతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

తాజా వార్తలు