రవికుమార్ చావలి దర్శకత్వంలో వచ్చిన “దగ్గరగా దూరంగా” చిత్రం తరువాత సుమంత్ మరొక చిత్రంలో కనిపించలేదు. చాలా కాలం విరామం తరువాత అయన “ఏమో గుర్రం ఎగరవచ్చు” మరియు “ట్విస్ట్” అనే రెండు చిత్రాలలో కనిపిస్తున్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు” చిత్రానికి చంద్ర సిద్దార్థ దర్శకత్వం వహిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ ఏడాది చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఇదిలా ఉండగా సుమంత్ ఈరోజు ఒక ఆసక్తికరమయిన విషయాన్ని తెలిపారు. ఆయనకి ఎప్పటి నుండో ప్రతినాయక పాత్రలో నటించాలని బలమయిన కోరికట ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంటు లో తెలిపారు. ఇప్పటి వరకు ఒక రకం పాత్రల్లోనే కనిపించిన సుమంత్ ఇలా ప్రతినాయక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచుతారేమో చూడాల్సిందే మరి.