“పుష్ప” కు సుకుమార్ మరో సాలిడ్ ప్లానింగ్.?

“పుష్ప” కు సుకుమార్ మరో సాలిడ్ ప్లానింగ్.?

Published on Nov 6, 2020 11:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ ల కాంబో అంటే మన టాలీవుడ్ లో ఒక స్పెషల్ బెంచ్ మార్క్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వీరితో దేవిశ్రీ సంగీతం..అంతే ఈ ముగ్గురి కాంబో ఒక సెన్సేషన్. కేవలం సంగీతం పరంగా మాత్రమే కాకుండా వీరి కాంబో అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం అందరికీ ఉంది.

మరి అలాంటిది ఈ కాంబో నుంచి ఇప్పుడు “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనితో మేకర్స్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఈ చిత్రం విషయంలో ఒక అంశం అలా మిస్టరీగానే మిగిలిపోయింది.

అదే ఈ సినిమా విలన్ రోల్ పై. మొదట విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు కానీ అది కుదరలేదు. తర్వాత కొన్ని పేర్లు వినిపించాయి కానీ సుకుమార్ మైండ్ లో మాత్రం ఈ రోల్ కు సాలిడ్ ప్లానింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ నుంచి ఒక స్టార్ నటుణ్ని ఈ చిత్రంలో విలన్ గా చూపించాలని అనుకుంటున్నారట.

తన “పుష్ప” రాజ్ ను ఢీ కొట్ట గలిగే సాలిడ్ పర్సనాలిటీని బాలీవుడ్ నుంచి పికప్ చెయ్యాలని సుక్కు అనుకుంటున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి మొదటి నుంచీ ఆసక్తిగా మారిన ఈ రోల్ ఎవరు కనిపిస్తారో చూడాలి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు