విడుదల తేదీ : జూలై 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సుహాస్, మాళవిక మనోజ్, అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని మరియు ఇతరులు
దర్శకత్వం: రామ్ గోధాల
నిర్మాత : హరీష్ నల్లా
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్
ఎడిటర్ : భవిన్ ఎం షా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా నటించిన మరో చిత్రమే ‘ఓ భామ అయ్యో రామ’. గత వారం ఓటీటీలో ఉప్పు కప్పురంబు తో పలకరించిన సుహాస్ ఈ వారం థియేటర్స్ లోకి వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అసలు సినిమాలంటే ఇష్టం ఉండని రామ్ (సుహాస్) లైఫ్ లోకి ఒక వెల్ సెటైల్డ్ అమ్మాయి సత్యభామ (మాళవిక మనోజ్) వచ్చాక అతని ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఇలా ఆమెని ఇష్టపడ్డ తర్వాత అంతా సాఫీగా వెళుతుంది అనే సమయంలో ఆమె రామ్ కి ఒక కండిషన్ పెడుతుంది. అది ఎంతలా అంటే రామ్ కి దాన్ని ఓకే చెయ్యడం తప్ప మరో ఆప్షన్ లేకుండా ఉంటుంది. మరి ఆ కండిషన్ ఏంటి? అది ఒప్పుకున్నాక రామ్ లైఫ్ ఎలా మారింది? వీరి లవ్ లైఫ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన నటి మాళవిక మనోజ్ తన రోల్ లో షైన్ అయ్యిందని చెప్పవచ్చు. తన హావభావాలు, కామెడీ టైమింగ్ వంటివి బాగున్నాయి. ముఖ్యంగా సుహాస్ తో సన్నివేశాల్లో బాగా చేసింది.
అలాగే నటుడు సాత్విక్ తో కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్వలేదనిపిస్తాయి. సుహాస్ కూడా తన రోల్ లో ఓకే అనిపిస్తాడు. వీరితో మిగతా కొందరు నటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసే అంశాలు మాత్రం ఎక్కువే కనిపిస్తాయి. మెయిన్ గా స్క్రిప్ట్ వర్క్ బాగాలేదు. లైన్ వరకు ఓకే కానీ దీనికి అనుగుణంగా అల్లుకున్న కథనం అనేది చూసే ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. అలా నెమ్మదిగా సాగుతూ ఎటెటో వెళ్లిపోతున్న భావన కలుగుతుంది.
అనవసర సాగదీత రిపీటెడ్ సన్నివేశాలు బాగా బోర్ తెప్పిస్తాయి. ఇక వీటితో పాటుగా సినిమాల్ సరైన ఎమోషన్స్ కూడా లేవు. సుహాస్ సినిమాల్లో మినిమం ఎమోషన్స్ క్యారీ అవుతాయి. కానీ ఇందులో ఆ లేమి బాగా కనిపిస్తుంది.
చాలా ఊహాజనిత కథనం మరో మైనస్ అని చెప్పవచ్చు. అలాగే సుహాస్ మీద మినిమం హోప్ ఉన్నవారు కూడా ఈ సినిమా పరంగా డిజప్పాయింట్ అవుతారు. తనకి అంత స్కోప్ ఇచ్చే పాత్ర కూడా ఇది కాదు అనిపిస్తుంది. ఏదో చేసాడు అంటే చేసాడు అనుకునే రేంజ్ లో ఉంది.
ఇంకా సీనియర్ నటులు ఆలీ, బబ్లూ పృథ్వీరాజ్ లాంటి వారు ఉన్నా కూడా సినిమాలో వారికి సరైన పాత్రలు లేవు సో వారి ఎఫర్ట్స్ కూడా సినిమాలో వేస్ట్ అయ్యాయి. పాటలు, వాటి ప్లేస్ మెంట్ కూడా డిజప్పాయింట్ చేసాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రధన్ స్కోర్ ఓకే కానీ పాటలు మాత్రం తన ఆల్బమ్స్ పై మినిమం ఐడియా ఉన్నవారిని కూడా డిజప్పాయింట్ చేస్తాయి. భవిన్ ఎమ్ షా ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఒక 30 నిమిషాల వరకు తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు రాము గోధాల విషయానికి వస్తే.. తను డిజప్పాయింట్ చేసే వర్క్ అందించారు. బేసిక్ లైన్ వరకు ఓకే కానీ దాన్ని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యారు. సో ఈ సినిమాకి తనింకా హోమ్ వర్క్ చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘ఓ భామ అయ్యో రామ’ డిజప్పాయింట్ చేసే బోరింగ్ డ్రామా అని చెప్పవచ్చు. హీరోయిన్ మాళవిక మనోజ్ తన డెబ్యూ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. ఆమె మినహా సుహాస్ సైడ్ నుంచి కూడా పెద్దగా వర్కవుట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో లేవు. ముఖ్యంగా దర్శకుడు కథనంపై మరింత దృష్టి పెట్టాల్సింది. సో ఈ వీకెండ్ కి ఈ సినిమా బదులు మరో ఛాయిస్ ఎంచుకోండి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team