Akhanda 2 : ‘అఖండ 2’ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ.. కొత్త డేట్‌తో వస్తామని ప్రకటన..!

అఖండ 2

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ‘అఖండ 2’(Akhanda 2) కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో, చిత్రబృందం నిరాశాజనకమైన ప్రకటన విడుదల చేసింది. ఎంత ప్రయత్నించినా సినిమా ఈ సమయంలో థియేటర్లకు తీసుకురావడం సాధ్యం కాలేదని నిర్మాతలు తెలియజేశారు. అనుకోని పరిస్థితులు కారణంగా విడుదల వాయిదా పడటం తప్పలేకపోయామని వారు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరియు సినీ ప్రియులకు చిత్రబృందం హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో ’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ గారు మరియు దర్శకుడు బోయపాటి శ్రీను గారు అందించిన అండదండలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమా కోసం అందరూ చూపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.

అయితే త్వరలోనే అఖండ 2(Akhanda 2) కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని యూనిట్ స్పష్టం చేసింది. ఎప్పుడు వచ్చినా అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర రాజ్యం ఏలడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version