అల్లరోడి కెరీర్లో మైలు రాయిగా నిలిచిన ‘సుడిగాడు’

అల్లరోడి కెరీర్లో మైలు రాయిగా నిలిచిన ‘సుడిగాడు’

Published on Aug 31, 2012 8:00 AM IST

సడన్ స్టార్ అదేనండి సుడిగాడు సినిమా తర్వాత అల్లరి నరేష్ ని అందరూ పేరుతో పిలుస్తున్నారు. కామెడీ హీరోగా, మినిమం గ్యారంటీ హీరోగా పిలిపించుకునే అల్లరోడు సుడిగాడు తరువాత సడన్ స్టార్ గా మారి తన మార్కెట్ అమాంతం పెంచుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరోడి సినిమాలకు ఓవర్సీస్ లో ఇప్పటి వరకు పెద్దగా మార్కెట్ లేదు. సుడిగాడు తో సడన్ గా నరేష్ పెద్ద హీరోలతో పోటీ పడి వారి కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అల్లరోడు ఇలాగే కంటిన్యూ అయితే రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

తాజా వార్తలు