మహేష్, పవన్ ల మల్టీ స్టారర్ ఎలా మిస్సయింది?

మహేష్, పవన్ ల మల్టీ స్టారర్ ఎలా మిస్సయింది?

Published on Mar 21, 2020 2:00 AM IST

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వి. హీరో నాని, సుదీర్ బాబు కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలున్నాయి. ఉగాది కానుకగా ఈనెల 25న ఈ చిత్రం విడుదల కావాల్సివుండగా, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాం లో హీరో సుధీర్ పాల్గొన్నారు. ఈ టాక్ షోలో సుధీర్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. వి మూవీ కొరకు మొదటి ఛాయిస్ మహేష్, పవన్ అని ఆయన చెప్పారు.దర్శకుడు దృష్టిలో ఈ మల్టీ స్టారర్ ఛాయిస్ హీరోలు మహేష్ , పవన్ అయినప్పుడు నాని, సుధీర్ లకు అవకాశం ఎలా వచ్చింది అనేది, పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ ఐతే కానీ తెలియదు.

వి మూవీలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తుండగా, సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో ఈ చిత్రం నిర్మించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, ఏప్రిల్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు