కన్నడ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్న ప్రేమకథా చిత్రమ్

PKC
సుధీర్ బాబు తాజా సినిమా ‘ప్రేమ కధాచిత్రమ్’ కన్నడలో రీ-మేడ్ కానుంది. జె. ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. సుధీర్ బాబు, నందిత, గిరి మరియు ప్రవీణ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సాధించిన వసూళ్ళకు దిగ్భ్రాంతి చెందిన తమిళ, హిందీ నిర్మాతలు ఈ సినిమాను వాళ్ళ భాషలోకి తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను కన్నడలో పునర్ణిమించడానికి శ్రీధర్ రెడ్డి హక్కులను సొంతం చేసుకున్నాడు. ఓం ప్రకాష్ దర్శకత్వం వహించనున్నాడు.

చిరంజీవి సర్జ మరియు షన్వి శ్రీవాత్సవ(లవ్లీ ఫేం) ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ‘ప్రేమ కధాచిత్రమ్’ విజయంతో సుధీర్ బాబు, నందిత కెరీర్ తారాస్థాయికి చేరుకుంది. మారుతి కధ మరియు మాటలు అందించాడు. ఈ మధ్యే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలైన చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది

Exit mobile version