తెలుగులోకి అనువాదం కానున్న “కిచ్చ హచ్చ”


రాజమౌళి “ఈగ” చిత్రం తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో సుదీప్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ చిత్రం ఇక్కడ మంచి విజయం సాదించడమే కాకుండా సుదీప్ నటన అందరిని ఆకట్టుకోవడంతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అయన నటించిన ఒకానొక కన్నడ చిత్రం “కిచ్చ హచ్చ” తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి “కిచ్చ” అనే పేరుని ఖరారు చేశారు. గురు దత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కే మంజు నిర్మించారు. అరిగేల కిషోర్ ఈ చిత్ర అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుదీప్ మరియు రమ్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. జూలై మూడవ వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చేస్తారు. చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు. వి హరి కృష్ణ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version