సుమారు 2 గంటలు సాగే వర్మ 26/11

RGV

వివాదాలకు కేంద్ర బిందువు మరియు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ‘ది అటాక్స్ అఫ్ 26/11’. మార్చి 1 న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా అదే రోజున తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సినిమా నిడివి రెండుగంటల కన్నా తక్కువ ఉంటుందని ఇది వరకు తెలిపాము. ఈ సినిమాకి సంబందిచిన వారు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 100 – 112 నిమిషాలు ఉంటుంది. 2008 నవంబర్ 26న ముంబై లో జరిగిన దాడుల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ముంబై పోలీస్ కమీషనర్ గా నానా పటేకర్ నటించిన ఈ సినిమాలో సంజీవ్ జైస్వాల్ అజ్మల్ కసాబ్ పాత్రని పోషించాడు. ఈ సినిమాని 30 కోట్ల బడ్జెట్ తో తీసారు.

Exit mobile version