జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా బన్ని


ఒకప్పుడు అన్ని కమర్షియల్ యాడ్స్ లో బాలీవుడ్ స్టార్స్ లేదా మోడల్స్ మాత్రమే కనిపించే వారు. సౌత్ ఇండియన్ సినిమాలకి, స్టార్స్ కి ఇప్పుడు క్రేజ్ పెరగడంతో సౌత్ ఇండియన్ స్టార్స్ ఈ మధ్య చాలా ప్రొడక్ట్స్ మరియు షాపింగ్ మాల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే 7అప్ మరియు కాల్గేట్ మాక్స్ ఫ్రెష్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. బన్ని కొత్తగా జోయ్ అలుక్కాస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి అంగీకారం తెలిపాడు. బన్నికి ముందు జోయ్ అలుక్కాస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మాధవన్ వ్యవహరించాడు. ప్రస్తుతం దీనికోసం బన్ని ఒక యాడ్ చేస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే టాలీవుడ్ హీరోలైన నాగార్జున కళ్యాణ్ జ్యువెల్లర్స్ కి, మహేష్ బాబు జోస్ అలుక్కాస్ కి మరియు ఎన్.టి.ఆర్ మలబార్ గోల్డ్ కి ప్రచార కర్తలుగా పనిచేస్తున్నారు

Exit mobile version