గబ్బర్ సింగ్ టీజర్ కి అదిరిపోయే స్పందన

గబ్బర్ సింగ్ టీజర్ కి అదిరిపోయే స్పందన

Published on Feb 23, 2012 1:11 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ మసాల ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ చిత్రానికి సంబందించిన మొదటి టీజర్ విడుదల చేయగా భారీ స్థాయిలో స్పందన లభించింది.ఈ రోజు ఉదయం ఈ వీడియో టీజర్ ని విడుదల చేయగా ఒకే నిమిషంలో వేల మంది టీజర్ చూడటానికి పోటీ పడ్డారు. పవన్ అభిమానులు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు పేస్ బుక్ మరియు ట్విట్టర్ లో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ టీజర్ చూసి చాలా ఆనందంలో ఉన్నారు. పవన్ చెప్పిన ‘ నాకు తిక్కుంది .. కాని దానికో లేక్కుంది’ డైలాగ్ కి అభిమానుల నుండి విపరీతమైన స్పందన లభిస్తుంది. పంచ్ డైలాగులకి పవన్ పెట్టింది పేరు. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

గబ్బర్ సింగ్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – వీడియో లింక్

తాజా వార్తలు