జాను చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో సందడి చేశారు. హీరో శర్వానంద్, సమంత లతో పాటు నిర్మాత దిల్ రాజు నేడు వైజాగ్ లోని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సందర్శించారు. దీనితో రఘు కాలేజీ క్యాంపస్ విద్యార్థులతో కిక్కిరిపోయింది. తమ ఫేవరేట్ హీరో హీరోయిన్ ని చూడడానికి వారు ఎగబడ్డారు. వీరు నిల్చున్న స్టేజి ముందు విద్యార్థుల ఈలలు,కేకలతో కోలాహాలంగా మారింది. శర్వా నంద్, సమంత విద్యార్థులు వారికి ఇచ్చిన వెల్కమ్ కి, చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జాను సినిమా చూడాలని వారిని కోరారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు జాను చిత్రాన్ని నిర్మించారు. తమిళ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ గా జాను తెరకెక్కింది. దర్శకుడు సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా గోవింద్ వసంత్ సంగీతం అందించారు. ఈనెల 7న జాను గ్రాండ్ గా విడుదల కానుంది.