అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?

అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?

Published on Sep 10, 2025 9:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ చిత్రమే “ఓజి”. ఈ సినిమాపై ఉన్న అంచనాలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు వరకు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఆల్రెడీ సెన్సేషనల్ బుకింగ్స్ కూడా యూఎస్ మార్కెట్ లో చూపిస్తుంది. అయితే ఇదంతా సినిమా ట్రైలర్ కూడా రాకుండానే చేస్తుండడం విశేషం.

దీనితో ట్రైలర్ కోసం మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఫైనల్ గా ఈ ట్రైలర్ కి డేట్ లాక్ అయినట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఓజి ట్రైలర్ ఈ సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు