ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఆసక్తికరమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా “స్టీఫెన్” త్వరలో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. దర్శకుడు మిథున్ బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో ‘గార్గి’ ఫేమ్ గోమతి శంకర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
డిసెంబర్ 5, 2025 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. పలువురు అమ్మాయిలు మిస్ అవడంతో ఓ కిల్లర్‌ను సైకియాట్రిస్ట్ ఇన్వె్స్టిగేట్ చేసే కథతో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతమేర థ్రిల్ చేస్తుందో చూడాలి.
