సుధా కొంగర క్రేజ్ అమాంతం పెరిగిపోయింది


దర్శకురాలు సుధా కొంగర పేరు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో మోగిపోతోంది. ఓటీటీ సినిమాల హవా పెరిగినప్పటి నుండి విడుదలైన పలు సినిమాల్లో సుధా కొంగర డైరెక్ట్ చేసిన ‘ఆకాశం నీ హద్దురా !’ చిత్రమే పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం. తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ సినిమాకు గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. సుధా కొంగర సినిమాను రూపొందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

మరీ ముఖ్యంగా హీరో సూర్యలోని పరిపూర్ణమైన నటుడిని ఆమె ఆవిష్కరించిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ అయింది. వాస్తవ జీవిత కథకు కొంత కల్పిత కథనాన్ని జోడించి ఆమె సినిమాను రూపొందించిన తీరు బాగా వర్కవుట్ అయింది. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడ ఆమె ప్రతిభకు ఫిదా అయ్యారు. కొందరు హీరోలు ఆమెతో వర్క్ చేయాలని ఉందని నేరుగా చెప్పేస్తుంటే స్టార్ హీరోలు కొందరు తన జాబితాలో ఆమె పేరును చేర్చుకుని పెట్టుకుంటున్నారట. తమిళ స్టార్ హీరో విజయ్ తన 66వ సినిమాకు ఆమెను కూడ దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆమె చెప్పబోయే స్టోరీ గనుక విజయ్ కు నచ్చితే ఆమెనే ఫైనల్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version