కరోనా వైరస్ కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఎవ్వరూ ఇంటిలో నుండి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ప్రభుత్వాలు సైతం జనసమర్ధం ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడని చెప్పడం జరిగింది. నానాటికి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో మరింత దయనీయ సంఘటనలను చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితి స్టార్ హీరోలకు ఒక కోణంలో పేవర్ చేసింది. అదేమిటంటే స్టార్ హీరోలు ప్రస్తుతం తమ సమయం మొత్తం ఫ్యామిలీ తో గడపడానికి కేటాయిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో అన్ని సినిమాల షూటింగ్స్ కు మే 31వరకు బంద్ ప్రకటించడం జరిగింది. దీనితో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, పవన్,ప్రభాస్, బన్నీ, చరణ్ లు తమ కుటుంబాలతో సమయం గడుపుతున్నారు. షూటింగ్స్ కారణంగా ఎప్పుడూ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే హీరోలకు కరోనా వలన వచ్చిన విరామం వారి కొరకు సమయం కేటాయించే అవకాశం కలిపించింది. దీనితో ఈ స్టార్ హీరోలు ఇంటికే పరిమితమై వారి వారి కుటుంబాలతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.