మెగా హీరో సాయి తేజ్ దేవ కట్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకో 10 రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. దేవ కట్ట సినిమాలంటే కథలో తప్పకుండా డెప్త్ ఉంటుంది. అందులోనూ ఈ చిత్రం రాజకీయాల నేపథ్యంలో నడిచే సినిమా కాబట్టి స్టోరీని గట్టిగానే రాసుకుని ఉంటారు. తేజ్ సైతం దేవ కట్ట సినిమాను రాసిన తీరును తెగ పొగిడేశారు.
సో.. కథ బలంగా ఉంది కాబట్టి అందులో నటించే నటీనటులు కూడ స్టఫ్ ఉన్నవ్యక్తులైతే సినిమాకు అదనపు బలం చేకూరుతుంది. అందుకే రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్లను తీసుకున్నారట. రమ్యకృష్ణ ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేస్తారని, జగపతిబాబు హీరో తండ్రిగా కనిపిస్తారని వారట్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటే టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సైతం ఈ సినిమాలో నటించనుందట. అయితే ఈ వార్తల విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే త్వరలో మొదలుకానున్న మొదటి షెద్యూల్నెలా రోజులకు పైగానే నడుస్తుందని, అక్కడే సగం సినిమా కంప్లీట్ అవుతుందని టాక్.