విషాదం : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. పలువురి మృతి!

తమిళనాడులోని కరూర్‌లో థలపతి విజయ్ (TVK అధ్యక్షుడు) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది మృతిచెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో విజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక లక్ష మందికి పైగా సభకు హాజరైనట్లు సమాచారం. గాయపడిన వారికి చికిత్స కోసం తిరుచ్చి, సేలం నుంచి అదనపు వైద్యులను ప్రభుత్వం పంపింది.

ఈ విషాద ఘటనతో ముఖ్యమంత్రి స్టాలిన్ తక్షణ వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనతో విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనపై అనిశ్చితి నెలకొంది.

Exit mobile version