అక్కడ వీకెండ్ ముగిసేసరికి ఓజీ మైల్‌స్టోన్ ఖాయం..!

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ విధ్వంసాన్ని మొదలుపెట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ప్రీమియర్ షోలతోనే $3 మిలియన్ వసూలు చేసి సత్తా చాటింది. రెండు రోజుల్లో $4.4 మిలియన్లను రాబట్టి, వీకెండ్ నాటికి $5 మిలియన్ క్లబ్‌లో చేరనుంది.

పవన్ కెరీర్‌లో ఈ రికార్డు తొలిసారి కాబోతుంది. డివివి దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమ‌న్ సంగీతం అందించగా, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version