ఎట్టకేలకు ఎస్ ఎస్ రాజమౌళి కల నిజమయ్యింది. “విశ్వరూపం” చిత్ర ఆడియో విడుదల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ ని ఎస్ ఎస్ రాజమౌళి కలిసారు. ఈ చిత్ర ఆడియో విడుదలకు ముఖ్య అతిధిగా హాజరయిన రాజమౌళి మాట్లాడుతూ ” అందరు భయపడే సమయంలోనే కమల్ హసన్ చాలా ప్రయోగాలు చేశారు. అయన నటిస్తున్న కాలంలో నేను దర్శకుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అయన రాబోతున్న చిత్రం “విశ్వరూపం” చూడటానికి చాలా తహతహలాడుతున్నాను” అని అన్నారు. ఈరోజు రాజమౌళి మరి కొన్ని మధుర క్షణాలను తన ఖాతాలోకి జమ చేసుకున్నారు.మా టీవీ కోసం ఈ విలక్షణ దర్శకుడు కమల్ హాసన్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం త్వరలో మా టివిలో ప్రదర్శితం అవుతుంది. కమల్ హాసన్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆంద్ర ప్రదేశ్ లో దాసర్ నారాయణ రావు పంపిణి చేస్తున్నారు. కమల్ హాసన్, ఆండ్రియా,పూజ కుమార్ మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. శంకర్ -ఎహాసన్- లాయ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు,తమిళ హిందీలలో జనవరి 11న విడుదల కానుంది.