బాలకృష్ణ ‘లెజెండ్’ ఆడియో లాంచ్ కి రానున్న ఎస్ఎస్ రాజమౌళి

balakrishna-rajamouli
టాలీవుడ్ అభిమానుల్లో భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక హీరో, ఒక డైరెక్టర్ ఒక చోట కలిస్తే అభిమానుల కోలాహలం ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించలేం.. అలాంటి సంఘటనే రేపు విడుదల కానున్న ‘లెజెండ్’ ఆడియో వేదికలో జరగనుంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ ఆడియో వేడుకకి తన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. వీరివురూ ఒకేసారి స్టేజ్ పైన కనపడితే అభిమానులకి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.

రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకకి రాజమౌళితో పాటు శ్రీను వైట్ల కూడా ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ తీజర్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి ఈ మూవీని నిర్మంచారు.

Exit mobile version