‘లక్ష్యం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీ వాస్ తాజాగా మంచు ఫ్యామిలీ హీరోలతో చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమాని తనకి డైరెక్టర్ గా చాన్స్ ఇచ్చిన గోపీచంద్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన కథని అందిస్తుండగా, కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించనున్నారు.
గత సంవత్సరం ‘సాహసం’ తో విజయాన్ని అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం బి. గోపాల్ డైరెక్షన్ లో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీ వాస్ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.