సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శ్రీమన్నారాయణ’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శ్రీమన్నారాయణ’

Published on Aug 24, 2012 7:00 PM IST


నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘ శ్రీమన్నారాయణ’ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగుస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి సిద్దమవుతోంది. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి రవికుమార్ చావాలి దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లు చూసిన అభిమానులు బాలకృష్ణ ఈ చిత్రంతో మరో సూపర్ హిట్ కొట్టనున్నాడని భావిస్తున్నారు. ఈ చిత్రంలో రైతుల కోసం ప్రభుత్వంతో పోరాడే పవర్ఫుల్ టీవీ జర్నలిస్ట్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయాలలో వస్తున్న మార్పుల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే పాయింట్ మీద ఈ చిత్ర కథ ఉంటుందని దర్శకుడు రవికుమార్ చావాలి తెలిపారు.

తాజా వార్తలు