శ్రీ కాంత్ దేవరాయ విడుదల ఖరారు

శ్రీ కాంత్ దేవరాయ విడుదల ఖరారు

Published on Nov 9, 2012 7:04 PM IST

ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవరాయ’. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నవంబర్ 16న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయలు గారి చరిత్రను చూపించనున్నారు. కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నాని కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి దీక్షిత్ మరియు విదిష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయల కాలంలో వచ్చే సన్నివేశాల్లో ఎక్కువగా ఉంటాయి.

తాజా వార్తలు