ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ‘లక్కీ’


ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ హీరోగా, మేఘనా రాజ్ కథానాయికగా నటిస్తున్న ” లక్కీ” చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవలే శ్రీకాంత్ ప్రధానంగా సాగే సన్నివేశాలను హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జూలై 6న మొదలై జూలై 20 వరకు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకోనుంది. హరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాత వి. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ” శ్రీ కాంత్ కెరీర్లోనే విభిన్న చిత్రంగా నిలిచిపోతుందన్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని దశరాకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు”. సహజ నటి జయసుధ, రోజా మరియు బ్రహ్మానందంలు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version