ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ హీరోగా, మేఘన హీరోయిన్ గా సీనియర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 5న ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’యాక్షన్ నేపధ్యంలో సాగే భినమైన కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని’ తెలిపారు. పోసాని కృష్ణ మురళి, చిత్రంశ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.