శ్రీదేవి నా స్క్రిప్ట్ ఓకే చేసింది – కోన వెంకట్

Kona-Venkat

నిన్నటి తరం బాలీవుడ్ బ్యూటీ, ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఎవర్గ్రీన్ బ్యూటీ అయిన శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ కథలను ఎంచుకుంటోంది. చివరికి ఆమె మరో సినిమా చేయడానికి సిద్దమైనట్టు అనిపిస్తోంది. తెలుగు రైటర్, డైరెక్టర్ కోన వెంకట్ ఈ రోజు వేసిన ట్వీట్స్ లో శ్రీదేవి తన స్క్రిప్ట్ ఓకే చేసినట్లు తెలిపారు.

‘ ఆల్ టైం లేడీ సూపర్ స్టార్ అయిన శ్రీదేవిని కలవడం చాలా అందంగా ఉంది. శ్రీదేవి గారికి కథ వినిపించడం జరిగింది, దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ సినిమాని మూడు భాషల్లో బోనీ కపూర్ నిర్మించనున్నాడు. డైరెక్టర్ , నటీనటులు మొదలైన వివరాలు త్వరలోనే తెలియజేస్తారని’ కోన వెంకట్ ట్వీట్ చేసారు.

చాలా హిట్ సినిమాలకి కోన వెంకట్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. ఉదాహరణకి ‘దూకుడు’, ‘బాద్షా’, ‘డీ’, ‘బలుపు’ మొదలైన సినిమాలకు పనిచేసాడు. అలాగే కోన వెంకట్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కూడా మంచి రిలేషన్ ఉంది.

Exit mobile version