శ్రీ 420లో హీరోగా శివారెడ్డి తమ్ముడు సంపత్

sri420
శివా రెడ్డి సోదరుడు సంపత్ హీరోగా పరిచయం కానున్నారు. “శ్రీ 420” అనే చిత్రంతో ఈయన తెలుగు తెరకు పరిచయం కానున్నారు దివ్య ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. కె వి సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ రమేష్ మరియు హరి కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు కె వి సాయి, రాజమౌళి దగ్గర మూడేళ్ళు సహాయకుడిగా పని చేశారు ఈ చిత్రంలో కథతో పాటు మంచి సందేశం ఉంటుందని నిర్మాతలు తెలిపారు. అన్నను ఆదరించినట్టే తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉందని సంపత్ అన్నారు ఈ చిత్రానికి శేఖర్ విఖ్యాత్ కథనం,మాటలు అందిస్తున్నారు

Exit mobile version