కెరీర్లో చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ అన్నీ మల్టీ స్టారర్ సినిమాలే చేసిన దర్శకుడు శ్రీ వాస్. శ్రీ వాస్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’ గత శుక్రవారం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్న శ్రీ వాస్ డా. మోహన్ బాబుకి థాంక్స్ చెప్పాడు. ‘మోహన్ బాబు లాంటి పెద్ద స్థాయి నటుడితోనే కాకుండా మరో ఐదుగురు హీరోలు ఈ సినిమాలో నటించారు. అంతమందితో చేసిన సినిమా ఏమన్నా తేడా కొడితే వాళ్లకి తిరిగి మొహం చూపించలేం. అందుకే ముగ్గురు రచయితలు ఈ సినిమాకి పనిచేసారు. అలాగే మోహన్ బాబు గారు ‘నేను మోహన్ బాబుని నేనిలానే చేస్తాను అని అనుకొని ఉంటే’ సినిమా అంత బాగా వచ్చేదే కాదు. అన్ని విషయాల్లోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే అందుకే ఈ సందర్భంగా ఆయనకి థాంక్స్ చెప్తున్నానని’ అన్నాడు.
దా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ హీరోలుగా కనిపించిన ఈ సినిమాలో రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించారు.