శ్రీ శ్రీ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ చిత్రం

uday-kiran
ఉదయ్ కిరణ్ రాబోతున్న చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. శ్రీ శ్రీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. స్కై వాక్ కార్పొరేషన్ మరియు ఫ్లైయింగ్ కలర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో అన్ని సమపాళ్ళలో ఉంటాయి ఉదయ్ కిరణ్ కెరీర్లో ఇలాంటి పాత్ర పోషించలేదు అని చెప్పారు. నిర్మాత సి హెచ్ మున్నా మాట్లాడుతూ గతంలో విజయ్ భాస్కర్ మరియు రామ్ ప్రసాద్ వంటి దర్శకులతో పని చేశాం ఇప్పుడు కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాం అని చెప్పారు ఈ చిత్రం ఈ నెలలోనే చిత్రీకరణ మొదలుపెట్టుకోనుంది.

Exit mobile version