మాటలు రాని అమ్మాయిగా అబజబదబ అని ప్రేక్షకులని నవ్వించిన శ్రీ లక్ష్మీ తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. 3 దశాబ్దాలు కమెడియన్ గా సినిమాలు చేసిన శ్రీ లక్ష్మీ మొత్తంగా 500 వందల సినిమాల్లో కనిపించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు శ్రీ లక్ష్మీ ఫ్యామిలీ నుంచి మరో నటి తెరకు పరిచయం కానుంది. తన పేరు ఐశ్వర్య రాజేష్.
కొద్ది సంవత్సరాల క్రితం ఓ డాన్స్ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన ఐశ్వర్య రాజేష్ త్వరలో హీరోయిన్ గా తమిళ్లో పరిచయం కానుంది. ఇటీవల కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ సేతుపతితో ఐశ్వర్య వరుసగా రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి రమ్మి, రెండవది పన్నైయరుం పద్మినియం. ఈ రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే పన్నైయరుం పద్మినియం సినిమా రీమేక్ రైట్స్ ని నాని కొనుక్కున్నారు.