ఘనంగా విడుదలైన శ్రీరామ్ చంద్ర కొత్త చిత్రం ఆడియో

Prema-Geema-Jantha-Nai-Audi
ఇండియన్ ఐడల్ గా నిలిచిన శ్రీరామ్ చంద్ర హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ధ తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. అతను నటిస్తున్న చిత్రం పేరు ‘ప్రేమ గీమ జాంతానై’

‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన శ్రీరామ్ చంద్ర. సరైన పద ఉచ్ఛారణతో అందరి ప్రశంసలు పొందాడు. ‘ప్రేమ గీమ జాంతానై’ సినిమా అతనికి హీరోగా తొలి చిత్రం. ప్రియాంక చోప్రా కజిన్ అయిన బార్బీ హండ హీరోయిన్. ఈ సినిమా ఆడియో ఈరోజు శిల్పకళావేదికలో విడుదల చేశారు. ఈ వేడుకకు చాలామంది సినీప్రముఖుల హాజరయ్యారు

శుభ క్రియేషన్స్ బ్యానర్ పై మద్ధాల భాస్కర్ నిర్మాత. ఆర్.వి సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందించాడు

Exit mobile version