ఎన్టీఆర్ రాబోతున్న చిత్రం “బాద్షా” ఇటలీలో జూలై 9 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. శ్రీను వైట్ల ఈరోజు రాత్రి చెన్నై లో ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో పాల్గొన్న తరువాత అక్కడ నుండి నేరుగా ఇటలీ పయనమవ్వనున్నారు. ఈ అవార్డు ఫంక్షన్లో ఆయన “దూకుడు” చిత్రంకి గాను ఉత్తమ దర్శకుడిగా నామినేట్ అయ్యారు,ఈ అవార్డు ఆయననే వరించేలా ఉంది. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు గోపి మోహన్ మరియు మహేష్ బాబులు పాల్గొంటారు. ఇటలీలో ఈ షెడ్యూల్ లో రెండు పాటలు మరియు కొన్ని సన్నివేశాలని 25 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా గణేష్ బాబు నిర్మిస్తున్నారు. గోపి మోహన్ మరియు కోన వెంకట్ కథ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో సేక్రేట్ ఏజెంట్ గా కనిపిస్తాడు అనే పుకారు నిజం కాదు. ఈ చిత్రం వినోదాత్మకమయిన చిత్రంగా ఉండబోతుంది.