ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సర కానుకగా ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తొలి అడుగైన, తోలివలపైనా జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం అనే కాన్సెప్టే తో ఈ నూతన సంవత్సరం లో తొలి రోజు ఎన్నో ఆనందాలకి నాంది కావాలి అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. ఎప్పటినుండో ఓ ప్రైవేటే ఆల్బం రూపొందించాలన్న తన ఆలోచనకు ఈ పాత తొలి అడుగు అని శ్రీలేఖ అన్నారు. ప్రముఖ రచయిత సిరాశ్రీ రచించిన ఈ గీతాన్ని శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ ఈ తొలి ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్ష తో ఈ పాటని రూపిందిన్చనని అన్నారు .