శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. గ్లింప్స్ వదిలిన మేకర్స్

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. గ్లింప్స్ వదిలిన మేకర్స్

Published on Feb 15, 2025 9:01 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల అని చెప్పవచ్చు. జయాపజయాలతో సంబంధం లేకుండా శ్రీలీల ఇపుడు సౌత్ లో దూసుకెళ్తుంది. అయితే శ్రీలీల తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వగా తన నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇపుడు ఖరారు అయ్యింది.

గత కొన్నాళ్ల నుంచి తన బాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడు ఎవరితో ఉంటుంది అనేది క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్ గా ఇపుడు శ్రీలీల ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక లవ్ స్టోరీలో ఆమె నటించిన గ్లింప్స్ ఇపుడు బయటకి వచ్చింది.

దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించిన ఈ సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ గ్లింప్స్ మాత్రం వదిలారు. దీనితో తన బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఇక ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు