టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్రీకారం”. కిషోర్ బి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న శివరాత్రి కానుకగా సాలిడ్ బజ్ తో విడుదల అయ్యింది. మొదటి షో నుంచే మంచి టాక్ సంతరించుకున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్నట్టుగా పి ఆర్ టీం చెప్తున్నారు. మరి ఈ లెక్కల ప్రకారం ఏరియాల వారీగా చూసుకున్నట్టయితే..
నైజాం – 1.10 కోట్లు
సెడెడ్ – 75 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు
కృష్ణ – 25 లక్షలు
గుంటూరు – 65 లక్షలు
వైజాగ్ – 54 లక్షలు
తూర్పు – 30 లక్షలు
వెస్ట్ – 28 లక్షలు
మొత్తం ఏపీ, తెలంగాణాలో షేర్ – 4.01 కోట్లు
ఇది ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అంతే కాకుండా ఈ వారాంతానికి ఖచ్చితంగా మరింత మంచి వసూళ్లు రావడం ఖాయం అని చెప్పొచ్చు, ఇక ఈ సందేశాత్మక చిత్రానికి మిక్కీ జె మేయర్ మేయర్ సంగీతం అందివ్వగా రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట నిర్మాణం వహించారు.