శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సింగిల్’ పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో వసూలు చేస్తోంది. 3వ రోజు అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఈ వారం ప్రారంభంలో కూడా తన ప్రభావం చూపిస్తోంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 16.3 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఆదివారం నాడే రూ. 5.1 కోట్లు వసూలు చేసింది. పైగా గత 24 గంటల్లోనే, బుక్‌మైషోలో 66 వేల+ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో, మొత్తం టిక్కెట్ల సంఖ్య 2 లక్షలను దాటింది.
అటు ఓవర్సీస్ లో కూడా వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం యూఎస్ఏలో $400 K మార్కును దాటి, అర మిలియన్ మార్కు వైపు దూసుకుపోతోంది. దీంతో, ఈ సినిమాకు ఈ వీక్ మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.