శ్రీ విష్ణుతో ‘సామజవరగమనా’ కాంబో రిపీట్.. ఈసారి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్..!

శ్రీ విష్ణుతో ‘సామజవరగమనా’ కాంబో రిపీట్.. ఈసారి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్..!

Published on Jul 10, 2025 11:00 PM IST

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీ విష్ణు. ఆయన నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. కామెడీని తనదైన శైలిలో పండించి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక రీసెంట్‌గా ఆయన ‘సింగిల్’ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు.

అయితే, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. శ్రీ విష్ణు కెరీర్‌లో సూపర్ సక్సెస్ చిత్రంగా నిలిచన ‘సామజవరగమనా’తో ఆయన ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ఇక ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ అబ్బరాజు ఓ కథ వినిపించగా దానికి శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

దీంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర ‘సామజవరగమనా’ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు