పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శ్రీవిష్ణు – రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్

‘సామజవరగమన’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ‘Sree Vishnu x Ram Abbaraju 2’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.

దసరా పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ఈ వేడుకకు నారా రోహిత్, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గొలి హాజరయ్యారు.

సామజవరగమన చిత్రానికి రచయితలుగా పనిచేసిన భాను భోగవరపు, నందు ఈ సినిమాకి కూడా స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Exit mobile version