మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాయక్’ సినిమాలో రామ్ చరణ్ ఇద్దరు అందాల భామలతో ఆడి పాడుతున్నారు. వాళ్ళెవరో కాదండీ మన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ మరియు ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉండనున్నాయి. వినాయక్ చివరిగా తీసిన ‘బద్రినాథ్’ సినిమాలో తమన్నాని చాలా గ్లామరస్ గా చూపించారు. ఇప్పుడు తీస్తున్న ‘నాయక్’ సినిమాలో కూడా కాజల్ మరియు అమల పాల్ లను పూర్తి గ్లామరస్ గా చూడవచ్చని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు.
కామెడీ మరియు యాక్షన్ ని కూడా సమపాళ్ళలో కలిపి చేస్తున్న ఈ సినిమా ఆడియో నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘నాయక్’ సినిమా కాకుండా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘ఎవడు’ మరియు బాలీవుడ్ రిమేక్ ‘జంజీర్’ సినిమాల్లో నటిస్తున్నారు.