యాక్షన్ చిత్రంలో రాఘవేంద్ర రావు శైలిలో ఒక పాట


అల్లరి నరేష్ రాబోతున్న కామెడి చిత్రం “యాక్షన్” లో దర్శకుడు రాఘవేంద్ర రావు గారి శైలిలోనే ఒక పాటను చిత్రీకరించనున్నారు.పాటలను చిత్రీకరించడం మరియు కథానాయికలను చూపించే విషయంలో రాఘవేంద్ర రావు గారి ప్రత్యేకత ఏంటో మనకి తెలిసిందే. “యాక్షన్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అనిల్ సుంకర, రాఘవేంద్ర రావు గారి శైలిలో ఒక పాటను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు బప్ప లహరి దీనికోసం ఒక పాటను రెట్రో స్టైల్ లో స్వరపరిచారు. రాఘవేంద్ర రావు కెరీర్లో వచ్చిన పాటలలో ఎటువంటిది చెయ్యాలనేది అనిల్ సుంకర నిర్ణయించుకోలేదు. యాక్షన్ చిత్రంలో వైభవ్, రాజు సుందరం, శ్యాం, స్నేహ ఉల్లాల్ మరియు కామన జేత్మలని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version